HomeMovie Newsసమస్యల్లో 'హరి హర వీర మల్లు' బయ్యర్స్

సమస్యల్లో ‘హరి హర వీర మల్లు’ బయ్యర్స్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కలయికలో క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా హరిహర వీరమల్లు. జూలై 24న గ్రాండ్ గా పలుభాషల ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇటీవల రిలీజైన టీజర్ ట్రైలర్ అలానే సాంగ్స్ తో మంచి అంచనాలు ఏర్పర్చిన ఈ సినిమా ముందు రోజు ప్రీమియర్స్ నుండి నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. . పవన్ కళ్యాణ్ యాక్టింగ్, రెండు సాంగ్స్, కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నప్పటికీ ఓవరాల్ గా హరి హర వీర మల్లు బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం పూర్తిగా చతికల పడింది. అయితే ప్రీమియర్స్ నుండే పూర్తిగా నెగటివ్ టాక్ రాబట్టిన ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ దెబ్బేసింది. మరీ ముఖ్యంగా మూవీలో విఎఫ్ఎక్స్ దారుణంగా ఉండడంతో అందరి నుండి ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి.

See also  కన్నప్ప - ప్రభాస్ లేదా క్లైమాక్స్ కాదు అసలు హైలైట్ అదే

కాగా అసలు విషయం ఏమిటంటే, మొత్తంగా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా అజ్ఞాతవాసి తరువాత మరొక్కసారి పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరొక డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో బయ్యర్స్ దాదాపుగా 50 శాతం పైగా నష్టాలు చవిచూడవలసి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ మూవీ కావడంతో మంచి ధరకు కొన్న బయ్యర్స్ కి ఇది ఊహించని షాక్. మరి వారికి నిర్మాత రత్నం నుండి ఎంత మేర నష్టపరిహారం లభిస్తుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp

See also  'హరి హర వీర మల్లు' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories